24-02-2026 01:05:38 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 23(విజయ క్రాంతి): ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజు ల సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్‌కు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించగా, ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తన చాంబర్‌లో నియామక పత్రం అందజేశారు.
విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గత నెల 23వ తేదీన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గా యపడి తొమ్మిది రోజులు మృత్యువుతో పో రాడి జనవరి 31న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే.
సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో జరిపించడమే కాకుండా, ఇటీవలే నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతు ల మీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
ఈ మేరకు సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ప్ర భుత్వం ఉద్యోగం కల్పించగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి నియామక పత్రం అదించారు. బాధి త కుటుంబానికి ఇకముందు కూడా ప్రభు త్వ యంత్రాంగం తోడ్పాటుగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు.సౌమ్య మరణానికి కారకులైన వారిని కఠినముగా శిక్ష పడే లా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, సీఐ స్వప్న, ఎస్‌ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.