11 April, 2026 | 5:23 AM

ఎల్లంపేట గడ్డ.. బీఆర్‌ఎస్‌కు ఎదురులేని జీవగడ్డ

14-02-2026 12:00 AM

జవహర్‌నగర్ నాయకుల సంబురాలు

జవహర్ నగర్ ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఎల్లంపేట మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ అభ్యర్థులు సత్తాచాటి ఎదురులేని గెలుపును సాధించారు. ఈ మేరకు శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎల్లంపేటలో పోటీ చేసిన బిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో జవహర్ నగర్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించిందన్నారు. కార్యక్ర మంలో మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, పల్లపు రవి, ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు శోభా రెడ్డి, నాయకులు మహేష్, కాసిం తదితరులు పాల్గొన్నారు.