calender_icon.png 14 February, 2026 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్‌లో విలక్షణమైన తీర్పు

14-02-2026 12:00:00 AM

ఖానాపూర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) :  ఖానాపూర్ మున్సిపాలిటీలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు దీంతో ఆంగ్ తప్పనిసరి అయింది.

కాంగ్రెస్ పార్టీకి మూడు భారత రాష్ట్ర సమితికి మూడు, బిజెపికి నాలుగు కౌన్సిలర్ స్థానాలు దక్కాయి. ఒక్కరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కైవాసం చేసుకోవాలంటే ఏడు స్థానాలు తప్పనిసరి. దీంతో బిఆర్‌ఎస్ బిజెపి పార్టీలు కూటమిగా ఏర్ప డి చెరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వెడుమ బొజ్జు పటే ల్ మున్సిపల్ స్థానంపై దృష్టి పెట్టినప్పటికీ మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్లో కొంత నిరాశ ఏర్పడింది.