9 May, 2026 | 5:33 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

మరోసారి తండ్రయిన మస్క్

01-03-2025 11:39 PM

మగ బిడ్డకు జన్మనిచ్చిన షివోన్ జిలిస్

‘సెల్డాన్ లైకుర్గస్’గా నామకరణం

వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. శనివారం మస్క్, షివోన్ జిలిస్ దంపతులకు నాలుగో సంతానంగా మగబిడ్డ పుట్టాడు. మస్క్ సహజీవనం చేస్తోన్న న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్ తమకు పుట్టిన మగ బిడ్డకు ‘సెల్డాన్ లైకుర్గస్’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఎక్స్ వేదికగా షివోన్ జిలిస్ స్పందిస్తూ.. ‘మూడో బిడ్డ ఆర్కాడియా పుట్టినరోజు సందర్భంగా అందరితో ఒక విషయాన్ని పంచుకుంటున్నా. ఎలాన్ మస్క్‌తో చర్చించిన అనంతరం మాకు పుట్టిన నాలుగో బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. మా కుమారుడికి ‘సెల్డాన్ లైకుర్గస్’ అని నామకరణం చేశాం’ అని పేర్కొన్నారు. కాగా 2021 నుంచి మస్క్.. షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టగా.. తాజాగా ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. మస్క్ తన మొదటి భార్య జస్టిన్‌తో కలిసి ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ వివాహమాడారు. వీరికి సంతానం కలగలేదు. అనంతరం కెనడా గాయని గ్రిమ్స్‌తో రిలేషన్ కొనసాగించారు. వీరికి ముగ్గురు పిల్లలు. మస్క్ మొదటిబిడ్డ అనారోగ్య కారణాల రిత్యా పుట్టిన 10 వారాలకే మృతి చెందాడు.