26 February, 2026 | 5:20 AM

ఎంబాజా సే ఇండియా

26-02-2026 01:37 AM
  1. నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో ఇంజనీర్లకు పోటీలు 

బగ్గీ వాహనం ఆవిష్కరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఇంజనీరింగ్ విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ’ఎంబాజా సే ఇండియా 2026’ పోటీలను పం జాగుట్ట అంజని టెక్ స్టూడియోలో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా నర్సా పూర్ వద్ద ఉన్న బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో జరగనున్న ఆన్-గ్రౌండ్ ఈవెంట్‌ను అధికారికంగా ప్రారం భించారు.

భారత్ పెట్రోలియం ’స్పీడ్ : హై పెర్ఫార్మెన్స్ పెట్రోల్’ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ 19వ ఎడిషన్‌లో ఈ పోటీలలో ఉపయోగించే ప్రత్యేక ’బగ్గీ’ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ జాతీయ స్థాయి పోటీ విద్యార్థులకు తరగతి గది వెలుపల ఒక అద్భుతమైన అభ్యాస వేదికను అందిస్తుంది. మూడు రోజుల ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుంచి వచ్చే విద్యార్థి బృం దాలు తమ ఆల్-టెర్రైన్ వెహికల్స్ రూపొందించడం, విశ్లేషించడం, తయారు చేయడం, రేసింగ్లో వాటి ప్రతిభను ప్రదర్శించడం చేయనున్నారు.

అమెరికాలో ఎస్‌ఏఈ ఇంటర్నేషనల్ ద్వారా ’మినీ ఎంబా జా సే’ (ఎంబాజా సే) పేరుతో ప్రారంభమైంది. భారతదేశంలో ఉన్న 51 ఇంజనీ రింగ్ కళాశాలలు, 1600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంబా జా సే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాలరాజ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రాక్టిక ల్ లెర్నింగ్ కోసం ఎంబాజా సే ఇం డియా ఒక జాతీయ వేదికగా ఎలా ఎదిగిం దో వివరించారు. పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య అనుసంధానాన్ని ఈ పోటీలు ఎలా నిలిచాయో చెప్పారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య విస్సం మాట్లాడుతూ..

శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి, విద్యార్థులలో ఆవిష్కరణలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. టైటిల్ స్పాన్సర్, బీపీసీఎల్ టెరిటరీ మేనేజర్ - రిటైల్ (నిజామాబాద్) శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎంబాజా సే ఇండియాతో బీపీసీఎల్ కు ఉన్న అనుబంధం ఎనలేనిదన్నారు.

కార్యక్రమంలో జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ జౌరా, ఎంబాజా సే ఇండి యా 2026 కన్వీనర్ అలీ సయ్యద్, బీవీఆర్‌ఐటీ ప్రొఫెసర్ అండ్ డీన్ (మెకానికల్ ఇంజనీరింగ్), ఎంబాజా సే ఇండియా జాయింట్ కన్వీనర్ డాక్టర్ వీ మురళీకృష్ణ, వీఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే, డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.