26 February, 2026 | 3:22 AM

రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

26-02-2026 01:37 AM

గోకరాజు లైలావతి కాలేజీలో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): గోకరాజు లైలావతి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన 3వ అంతర్జాతీయ సదస్సు ఐసీడబ్ల్యూస్‌ఎన్‌యూసీఏ రెండు రోజులపాటు విజయవంతంగా కొనసాగి ఘనంగా ముగిసింది. వివిధ విద్యా సంస్థల నుండి ప్రముఖ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సదస్సు విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, ఆధునిక కంప్యూటింగ్ రంగాల్లో ఉద్భవిస్తున్న నూతన ధోరణులపై చర్చలకు వేదికగా నిలిచింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రామ్మూర్తి (మహేంద్ర యూనివర్సిటీ) పాల్గొన్నారు. గ్లోబ ల్ పరిశోధనలో ఉన్న సవాళ్లు, సస్టైనబిలిటీ సమస్యలు, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలపై ఆయన విశ్లేషణ చేశారు.

ప్రొఫెసర్ సామ్రాట్ ఎల్ సబత్ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) అంతరశాఖ పరి శోధన ప్రాధాన్యాన్ని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎ. కృష్ణయ్య, గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జంధ్యాల నారాయణ మూర్తి, జీఎల్‌ఈసీ ప్రిన్సిపాల్ ప్రొఫె సర్ సాయి హనుమాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి.ఎస్. రాజు, కాన్ఫరెన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పద్మాలయ నాయక్, డా. మొహమ్మద్ అఖిల్ మిర్జా (హాంకాంగ్), ప్రొఫెసర్ సచిదానంద దేహురి (ఒడిశా), డా. శిబ కుమార్ ఉద్గత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.