1 July, 2026 | 10:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ చీకటి అధ్యాయం..

28-06-2025 12:23 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోజుల్లో ప్రజలపై జరిగిన దుశ్చర్యలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్​లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ  నియంతగా వ్యవహరించారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21నెలల పాటు సాగిన నియంతృత్వ పాలనను ఎదురించిన వీరులందరికి జోహార్లు తెలిపారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

ఉద్యమంలో పాల్గొన్న వీరులకు సన్మానం..

ఎమర్జెన్సీ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డిని సన్మానించారు.