1 July, 2026 | 9:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

28-06-2025 12:24 AM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు, ( మర్రిగూడ ) జూన్ 27: ప్రజా సమస్యలు పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల పరిధిలోని ఎర్రగండ్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనమందరము కలిసికట్టుగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకోవాలని ఆయన అన్నారు.

గ్రామంలోకరెంటు లూస్ లైన్, కరెంట్ పోల్స్, త్రాగునీటి పైపులైన్ ల ను సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా తక్షణమే పరిష్కార మార్గం చూపాలని ఆయన అన్నారు. గ్రామంలో మురుగునీరు, డ్రైనేజీ సిస్టంసమస్య తక్షణమే అభివృద్ధి చేయాలని ఆయన గ్రామ కార్యదర్శిని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్లు రానివారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల ముఖ్య నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.