15 March, 2026 | 7:57 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఎమ్మీ అవార్డు వేడుక.. నటుడి చెంపమీద చేతిగుర్తు ?

16-09-2024 01:35 PM

Emmy Awardsఎమ్మీ అవర్డు ప్రధానోత్సవ వేడుకలో భాగంగా ఓ నటుడు వినూత్నంగా నిరసన తెలిపారు. సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 76వ ఎమ్మీ అవార్డు ప్రధానోత్సవ వేడుక లాస్ ఏంజల్స్ యూఎస్ లోని పికాక్ థియేటర్ వేదికగా ఘనంగా జరిగింది.  రిజర్వేషన్ డాగ్స్ నటుడు డిఫరో వూన్ ఏ తాయ్.. పవర్ ఫుల్ సందేశం ఇచ్చారు. తన ముఖంపై ఎరుపు రంగు చేతి గుర్తు ముద్ర వేసుకుని.. మిస్సింగ్ అండ్ మర్డర్డ్ ఇండీజీనస్ విమెన్(ఎంఎంఐడబ్లూ) మూవ్ మెంట్ కు వినూత్నంగా నిరసన తెలిపారు. కెనడా, అమెరికాలో స్థానిక మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అవగాహన పెంచుతూ, ఈ మూవ్ మెంట్ కు మద్దతు కూడగట్టాలనే ఉద్దేశ్యంతో ఈ కెనడా నటుడు ఇలా ప్రత్యేకంగా వచ్చారు. దాంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. సామాజిక న్యాయంపై ఆయన చూపిన నిబద్ధతను నెటిజెన్లు కొనియాడారు.