ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట
తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరి ష్కారం కోసం పోరాటాలకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమం చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధా న కార్యదర్శికి అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గాంధేయ మార్గం లో ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపడానికి ఏప్రిల్ 17న తహసీల్దార్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మధ్యాహ్నం భోజన విరా మ సమయంలో ధర్నా నిర్వహించారు. ఏప్రిల్ 18న నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ విధంగా దశలవారీ గా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు నిర్ణయించారు.
తెలంగాణలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విర మణ చేసి సంవత్సరం గడిచినా, వారికి రావాల్సిన బెనిఫిట్స్, ఏరియర్స్ అందడం లేదు. పీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు డీఏ లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ఉద్యో గులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఆరోగ్యకార్డులను జారీచేయాలని గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సార్లు కోరినా స్పందించలేదు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ తదితరులు త్వరలో నగదు రహిత ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. తమ బేసిక్ పే నుంచి ఒకటిన్నర శాతం ఆరోగ్యకార్డుల కోసం ఇవ్వడా నికి ఉద్యోగులు సిద్ధపడ్డారు. అయినప్పటికీ తాత్సారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని ఉద్యోగులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించడం కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల బాధ్య త. 2004 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఎంపికైన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, గెజిటెడ్ అధికారులకు, కార్మి కులకు పెన్షన్ సౌకర్యం తీసివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ ఉత్తర్వులను అమ లు చేస్తున్నాయి.
రెండు, మూడు రాష్ట్రాలే పాత పెన్షన్ సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ సౌకర్యం కల్పించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి పది శాతం, ప్రభుత్వం 10 శాతం కలిపి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో ఒకేసారి డ బ్బులు చెల్లిస్తారు. ఆ తర్వాత ఉద్యోగులకు ఎలాంటి అధికారాలు, హక్కులు ఉండవు.
పెన్షన్ అనేది వృద్ధాప్యంలో రక్షణ లాం టిది. జీవిత చరమాంకంలో ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా బతకడానికి ఇది తోడ్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక మంది పెన్షన్ సదుపాయం ఉందనే ఉద్యోగాల్లో చేరుతారు. పెన్షన్ అనేది ఉద్యో గ, ఉపాధ్యాయుల హక్కు. దాన్ని తొలగించాలనుకోవడం అవివేకమైన చర్య. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం లేదనే నిరాశ, నిస్పృహలు కలిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్లడం సాధ్యం కా దు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా ఒక్కసారి ఐదేండ్ల పాటు సేవలందిస్తే జీవితాం తం పెన్షన్ వస్తుంది. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో 40 సంవత్సరాలు పనిచేసినా పెన్షన్ లేదనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అయితే, 2025 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను తెచ్చింది. దీని ద్వారా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు, గెజిటెడ్ అధికారులకు, కార్మికులకు లభించే ప్రయోజనం ఏమీ లేదు.
ప్రమాదవశాత్తు మరణిస్తే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగుల కుటుంబ సభ్యులకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 1 నుంచి నూతన పాలసీ పేరుతో పెన్షనర్లకు భవిష్యత్తులో డీఏలు, పీఆర్సీలు ఉండదని చెప్పడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఉద్యోగ, ఉపా ధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్‌తో వృద్ధాప్యంలో టెన్షన్ లేకుండా ఉంటుందనే నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని ఉద్యోగ, ఉపాధ్యాయులు అం టున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయపరమైన కోరికైన పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
అయితే, 2004 కంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ జారీచేసి, భర్తీ చేయడంలో ఆలస్యమైతే వారికి పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులలో కొత్త ఆశలు చిగురించాయి. కొన్ని రాష్ట్ర ప్ర భుత్వాలు పాత పెన్షన్ స్కీమ్‌నే అమలు చేస్తున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో 2004 సెప్టెంబర్ 1 త ర్వాత ఎంపికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను కలిసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞాపన పత్రాలను సమర్పించారు. నిరసనలు వ్యక్తం చేశారు. అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసి మద్దతు కూడగట్టారు. తెలంగాణలో అప్పటి ముఖ్యమం త్రి కేసీఆర్‌ను, నాటి మంత్రులను కలిసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
సీపీఎస్‌ను రద్దు చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, కానీ కేంద్ర పాలసీ కావడం వలన ఢిల్లీ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ నాడు ప్రకటించారు. కానీ, ఆ దిశగా కార్యాచరణ లేకపోవడంతో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
2023లో అనేక రాష్ట్రాల్లో అసెం బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అబీ నహీ తో కబీ నహీ (ఇప్పుడు కాకుంటే ఎప్పు డు కాదు) అనే నినాదంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యోగులు ఉద్యమాలు చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సీపీఎస్ రద్దు కాలేదు.
పెన్షన్ సౌకర్యం తీసివేసి 22 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పెన్షన్ విద్రోహ దినంగా 2025 సెప్టెంబర్ 1న నాంపల్లిలోని తెలుగు లలిత కళా తోరణం, పబ్లిక్ గార్డెన్స్ లో ఉద్యోగులు సమావేశం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర క్యాబినెట్ భేటీ సందర్భంగా తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి శుభవార్త రాలేదు. ఈ నేపథ్యంలోనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్, యూని ఫైడ్ పెన్షన్ స్కీమ్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటూ మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తుండటంతో ఉద్యోగ, ఉపాధ్యా యులు ఉద్యమ బాటపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతు లు కల్పించడం, బదిలీలు చేయడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పి స్తుండడంతో పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తారనే నమ్మకంతో ఉద్యోగులు ఉన్నారు. తె లంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ప్రభుత్వానికి దూరం పెరగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యం లో తమ న్యాయమైన కోరిక అయిన పాత పెన్ష న్ స్కీమ్‌ను అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల స్వప్నం సాకారం చేయాలని కోరుతు న్నారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని, పెండిం గ్‌లో ఉన్న ఐదు డీఏలను మంజూ రు చే యాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేయాల ని కోరుతున్నారు. అయితే, ఈ నిరసనల్లో పె ద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాల నాయకులు పట్టుదలతో ఉన్నారు.
వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, 9290826988






