మరపురాని మనిషి సముద్రాల ధనంజయ్
2023లో భారత నేవీ, ఆర్మీ అధికారులు దేవరకొండను దర్శించినప్పుడు అన్ని ఏర్పా ట్లు చేసి, ఆత్మీయపూర్వకమైన ఆతిథ్యాన్ని ఇవ్వడం మరువలేని సంఘటన. ఏ పదవిని ఆశించకుండా ప్రజల మధ్య తిరుగుతూ, వారి కోసం పని చేసే ధనంజయ ఆశయం ఉదాత్తమైంది.
దేవరకొండ అనగానే నాకు వెంటనే సముద్రాల ధనంజయ్ గారు జ్ఞా పకం వస్తారు. నేనెప్పుడు దేవరకొండకు వెళ్లినా ధనంజయ్ గారు ప్రత్యక్షమవుతారు. వనం చంద్రమౌళి గారు హైదరాబాద్ నుం చి దివాకర్ల, రామరాజు లాంటి ఆచార్యులను పిలిచి దేవరకొండలో సాహిత్య కార్యక్ర మాలను నిర్వహించేవారు. ఆ క్రమంలో నన్ను కూడా ఆహ్వానించేవారు. అలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో ధనంజయ్ గారు అందరికంటే ముందుండేవారు.
వేదిక మీద అధ్యక్ష స్థానంలో న్యాయవాదిగా ప్రసిద్ధి పొందిన నెమ్మికంటి సోమన్న గారుండే వారు. వారికి నేనంటే ఎంతో అభిమానం. గుండేరావు హర్కారే శిష్యుడని వా రు నన్ను ఎంతో గౌరవించేవారు. నెమ్మికం టి వారితో పాటు ధనంజయ్ గారు నాకిచ్చిన గౌరవాన్ని ఈ జన్మలో మరిచిపోలేను.
ధనంజయ ఇంటి పేరు సముద్రం. స ముద్రంలో ఉప్పు ఉంటుంది కానీ, ధనంజయలో ఉప్పు బదులు తియ్యదనమే కనిపి స్తుంది. ధనంజయ్ ఎవరినీ నొప్పించేవారు కాదు, ఒప్పించేవారు మాత్రమే.
ఒకసారి దేవరకొండలో సాహిత్య కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి పది అయ్యింది. నాకు నిదురవస్తోంది. నా పరిస్థితి గమనించిన ధనంజయ కారులో తన ఇంటికి తీసుకొని వెళ్లి నాకాతిథ్యం ఇచ్చి, విశ్రాంతి క ల్పించిన ఆ రోజును ఇప్పటికీ మర్చిపోలేదు. ధనంజయకెంత సహనం ఉందో అంత సంపద ఉంది. ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే కర్ణుడు కాడు, దానకర్ణుడు. ఆయనది ‘ట్రాన్స్‌పోర్ట్’ వ్యాపారం. నిజాయితీగా తన వ్యాపారాన్ని కొనసాగించి, సంపా దించిన ధనంతో 1992 ప్రాంతంలోనే గుడిపల్లిలో తన తాతయ్య, నాయనమ్మ పేర్లమీద ‘బస్సు షెల్టర్’ నిర్మించారు.
దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేశారు. పడమటిపల్లిలోనూ బస్సు షెల్టర్లను రెండింటిని నిర్మిం చిన ఘనత వారిదే. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం ‘సముద్రాల లక్ష్మీ విద్యాలయాన్ని’ ఆరంభించారు. ధనంజయ గారు ఎంతో మందిని చరిత్ర, సంస్కృతి, కళలు, ప్రకృతి, మానవత్వం మొదలైన వాటి వైపు మళ్లించారు. ఆయన మృదువైన స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది.
దేవరకొండలో బతుకమ్మ పండుగ జరిగే వేళల్లో ధనంజయ సేవాదృక్పథం కనిపించేది. దేవరకొండ ప్రజల మధ్య స్నేహ వార ధి ఆయన. దేవరకొండ ఖివరకొండ సంబంధించిన చరిత్ర ఎవరికైనా తెలుసంటే అట్లా తెలిసిన వారిలో ధనంజయ గారే ముఖ్యులని చెప్పవచ్చు.
2023లో భారత నేవీ, ఆర్మీ అధికారులు దేవరకొండను దర్శించినప్పు డు అన్ని ఏర్పాట్లు చేసి, ఆత్మీయపూర్వకమై న ఆతిథ్యాన్ని ఇవ్వడం మరువలేని సంఘటన. ఏ పదవిని ఆశించకుండా ప్రజల మధ్య తిరుగుతూ, వారి కోసం పని చేసే ధనంజ య ఆశయం ఉదాత్తమైంది. కరోనా వ్యాక్సి న్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన అందరి మన్ననలు పొందారు.
గౌతమబుద్ధుని, వివేకానందుని బోధనలతో ప్రభావితుడైన ధనంజయ ‘మిత్రమం డలి’ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవరకొండలో లయన్స్ నేత్ర వైద్యాలయానికి చైర్మన్‌గా ఉన్నారు. లయన్స్ క్లబ్ శాశ్వత సభ్యులయ్యారు. ‘గరుడాద్రి ఆలయ’ స్థాపక సభ్యులు ధనంజయ గారే. హైదరాబాద్‌లోనూ ధనంజయ గారి సేవలు విస్తరింపబడ్డాయి. ‘బాలల ఫిలిం సొసైటీ’ సభ్యులుగా ఆయన నియమితులయ్యారు.
కాచిగూడలోని వైశ్య హాస్టల్ ట్రస్టు సభ్యులుగా ఉన్నారు. అలాగే ‘రెడ్‌క్రాస్ సొ సైటీ’, ‘తెలంగాణ రిసోర్స్ సెంటర్’ మొదలై న వాటిల్లో సభ్యులుగా తమ సేవలందిస్తున్నారు. మొదటి నుంచి సేవా దృష్టి గల ధనంజ య 1992 ‘స్థానిక ఉత్తమ నేత్ర శిబిరం’ నిర్వహణ అవార్డు, 1994లో ఉత్తమ జిల్లా లయన్ అవార్డు, 2018లో ‘తెలంగాణ ఫోక్ ఆర్ట్ అకాడమీ’ పక్షాన ‘ప్రజ్ఞా పురస్కారం’, బెస్ట్ ప్లాంటేషన్ డిస్ట్రిక్ట్ అవార్డు పొందారు.
ప్రముఖ సినీ నిర్మాత బి.నర్సింగ్‌రావు గారి ‘దాసి’ సినిమాకు ధనంజయ తన వం తు సహకారం అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటు చేశారు. ‘ఆసియన్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్’ నిర్వహణలో పాలుపంచుకున్నా రు. ముఖ్యంగా దేవరకొండలో ‘వాసవీ కళ్యాణమండం’ నిర్మాణానికి లక్షల రూపాయలను విరాళాలుగా సేకరించారు.
సాహి త్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ‘సాహితీ సమాఖ్య’ను స్థాపించారు. ప్రస్తుతం కర్మన్‌ఘాట్‌లోని ‘మాధవరం సెరినిటీ’లో నివాసం ఏర్పాటు చేసుకొని ‘హ్యాపీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్’ కో అధ్యక్షులుగా ఉన్నారు. ధనంజయ గారికి ‘డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్’ చైర్మన్ వేదకుమార్‌తో సన్నిహిత సంబంధం ఉంది. వేదకు మార్ స్థాపించిన ‘తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్‌సీ)’ సభ్యులుగా ఉండి, జంట నగరాల్లో ఆయా రంగాల్లో సుప్రసిద్ధులైన వ్యక్తులను ఆకర్షించారు.
టీఆర్‌సీలో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ధనంజయ, తన అనుభవా లను వ్యక్తపరిచి ప్రముఖుల ప్రశంసలు పొందారు. దేవరకొండకు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తే ధనంజయ అక్కడ తప్పక దర్శనం ఇచ్చేవారు. కానీ, ఒక రోజు టీఆర్‌సీలో ప్రత్యక్షమై నాకెంతో సంతోషాన్ని కలిగించారు. హైదరాబాద్ నగరంలో జరిగే సాహిత్య, సాంస్కృతిక సేవా రంగాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ధనంజ య విరివిగా పాల్గొనడం వారి ప్రత్యేకతను తెలియజేస్తుంది. ధనంజయ్ ౭౫ ఏళ్ల వయ సులో ఉన్నా, ఒక యువకుని లాగా సామా జిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
యోగా అంటే అతనికి చాలా ఇష్టం. సమయాన్ని బట్టి ఈశ్వర ధాన్యం చేస్తారు. ఒకరోజు త ప్పించి ఒకరోజు సత్సంగంలో పాల్గొంటా రు. ప్రాపంచికమైన చింత కంటే ఆధ్యాత్మిక చింతన అతనిలో ఎక్కువ. సుఖాలలో ఉన్న వాడు స్నేహితుడు కాడు, ఆపదలో మన వెంట ఉన్నవాడు మంచి స్నేహితుడని అత ని అభిప్రాయం. ఏ సమస్య అయినా ధై ర్యంతో ఎదుర్కోవాలని, లేదా చిరునవ్వుతో పరిష్కరించాలనేది అతని తలంపు. ధనం జయలో ఒక సైంటిఫిక్ విధానం కనిపిస్తుం ది. అతని జీవితంలోని కష్టాలను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు.
ధనంజయ ఒక జాతీయవాదిగా, మానవత్వం గల మనిషిగా దర్శనమిస్తారు. మాధవరం సెరినిటీలో జరిగిన వయోధికుల సమావేశానికి ముఖ్యఅతి థిగా నేను వెళ్లినప్పు డు, వేదిక మీద అధ్యక్ష స్థానంలో ఉన్నది ధనంజయ గారే. నాకు తెలియకుండానే న న్ను ముఖ్యఅతిథిగా పిలిచి చాలా కాలం తర్వాత దర్శనమిచ్చిన ధనంజయ మరపురాని మనిషి.
వ్యాసకర్త సెల్: 9885654381






