29-07-2025 02:21:26 AM
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆవేదన
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరుగుతోందని.. విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యా శాఖ ఉన్నా ఇలాంటి ఘటనలు తరుచుగా చోటుచేసుకోవడం విడ్డూరమని ఆయన విమర్శిం చారు. అనేక చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా..
చాలా వాటిని బయ టి ప్రపంచానికి తెలియకుండా దాచేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వి ద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కీలకమైన విద్యాశాఖకు అసలు మంత్రి గా బాధ్యత వహించే వారు ఉన్నారా అనే సం దేహం ప్రజల్లో కలుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఔషధాల నుంచి నూనెల వరకు, ఆహార పదార్థాల నుంచి గురుకులాల్లో భోజనం వరకూ ప్రతీ దాం ట్లో కల్తీ రాజ్యమేలుతోందన్నారు. అవినీతి, డ్రగ్స్, కల్తీ పదార్థాలు.. ఇవే కాంగ్రెస్ పాలన నిజ స్వరూపాలని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందనే భావ న ప్రజల్లో లేకుండా పోయిందని విమర్శించారు. బెల్టు షాపుల విషయంలో గత ప్రభుత్వానికంటే ఘోరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందన్నారు. ప్రజలను మద్యం మత్తులో ఉంచి హామీలు మరిచిపోయేలా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.