17 April, 2026 | 10:56 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

17-04-2026 09:17 PM

టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి

కోదాడ,(విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జంట కార్యాచరణ సమితి కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం చిరంజీవి, తీగల నరేష్, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, బంధం వెంకటేశ్వర్లు, ఆర్సి రెడ్డి,రామ నరసయ్య,  బడుగుల సైదులు, పాండురంగాచారి, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.