ఉద్యోగులకూ నియమాలుంటాయి
మనోహర్‌రావు చిలప్పగారి :
* ప్రభుత్వ అనుమతి లేకుండా పుస్తకాలను ప్రచురించడం, వాటి గురించి కాన్వాస్ చేయడం నిషిద్ధం. కానీ, ఆ పుస్తకంలోని విషయం సాహిత్యపరమైన, కళాత్మకమైన, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినది అయితే ప్రత్యేక మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగుల ప్రయోజనాలకు సం బంధించి ప్రభుత్వం పలు ఉత్తర్వులు వెలువరించడం సహజం. అలాగే సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగుల ప్రవర్తనకు సంబంధించి ఏపీ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి, 1964 అమలులోకి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి 1964ను ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది. నాటి నుంచి ఈ నియమావళిని అమలు పరుస్తున్నాం.
ఈ నియమాలు ప్రత్యేకించి ప్రభుత్వ సేవకులు అంటే ఉద్యోగులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? అనే విషయాలను సవివరంగా తెలియజేస్తా యి. ప్రభుత్వ ఉద్యోగి అంటే తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసులో సభ్యుడిగా ఉన్న వ్యక్తి లేదా రాష్ట్ర పరిధిలో ఏదైనా సివిల్ పోస్ట్‌లో ఉన్న వ్యక్తి అని అర్థం. అతను విధుల్లో ఉన్నా, సస్పెన్షన్‌లో ఉన్నా, సెలవులో ఉన్నా లేదా రాష్ట్రం లోపల లేదా వెలుపల ఇతర సేవలో ఉన్నా ఈ నియమాలు వర్తిస్తాయి.
ఈ నియమాలు ప్రభుత్వ ఉద్యోగితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పరోక్షంగా వర్తిస్తాయి. కుటుంబ సభ్యులు అంటే భార్య/భర్త, కుమార్తె, కుమారుడు మొదలైనవారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రవర్తనకు సంబంధించిన తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి-1964లోని నియమనిబంధనల్లో ఉద్యోగులకు కొన్ని పరిమితులు విధించారు.
ప్రవర్తన నియమాలు సమగ్ర వివరణ:
ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి గురించిన నియమాలపై సమగ్ర వివరణ ఇలా ఉన్నాయి.
1. సమ్మెలు, ప్రదర్శనలు (రూల్ 4 & 5): ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం విధులకు ఆటంకం కలిగించే సమ్మెలు చేయకూడదు. అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతి రేకంగా బహిరంగ ధర్నాలు లేదా ప్రదర్శన లు నిర్వహించకూడదు. కానీ, ప్రభుత్వం అనుమతించిన విధంగా ముందస్తుగా నోటీ సు సమ్మెలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు.
2. బహుమతులు, చందాలు
(రూల్ 6 &7): విధి నిర్వహణలో ఎవరి దగ్గర నుంచి కూడా విలువైన బహుమతులు, ఉచిత సేవ లు లేదా ఆతిథ్యాలను ఉద్యోగులు స్వీకరించకూడదు. ఇది అవినీతికి దారితీస్తుందని భావిస్తారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ రకమైన నిధుల సేకరణ లేదా చందాలు వసూలు చేయకూడదు.
3. ఆర్థిక వ్యవహారాలు
(రూల్ 8, 9, 10, 11 &12): ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నియమాల్లో పలు అంశాలున్నాయి. అప్పులు: అతిగా అప్పులు చేయడం లేదా ఇతరులకు భారీగా అప్పులు ఇవ్వకూడదు. ఇది ఆర్థిక ఇబ్బందులకు (insolvency) దారితీసి ఉద్యోగ బాధ్యతలను దెబ్బతీస్తుంది.
ఆస్తులు: స్థిర ఆస్తులు అంటే భూమి ఇల్లు లేదా చరాస్తులు కార్లు, షేర్లు ఇతర వస్తువుల కొనుగోలుకు ముందస్తు సమాచారం ఇవ్వడం, అనుమతి పొందడం లాంటివి చేయాలి.
ప్రైవేట్ వ్యాపారం: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రైవేట్ వ్యాపారం చేయడం లేదా కంపెనీల మేనేజ్‌మెంట్‌లో ఉండడం, అట్లా గే షేర్లు, ఇతరత్రా వ్యాపారాలు చేయడం నిషిద్ధం. అట్లాగే ప్రైవేటు ఉద్యోగం కూడా చేయకూడదు.
4. మీడియా, ప్రచురణలు
(రూల్ 13, 14, 15 & 16):
పుస్తక ప్రచురణ: ప్రభుత్వ అనుమతి లేకుండా పుస్తకాలను ప్రచురించడం, వాటి గురించి కాన్వాస్ చేయడం నిషిద్ధం. కానీ, ఆ పుస్తకంలోని విషయం సాహిత్యపరమైన, కళాత్మకమైన, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినది అయితే ప్రత్యేక మినహాయింపు ఉంటుంది.
రహస్యాలు: ప్రభుత్వ రహస్యాలను లేదా అధికారిక పత్రాలను బయటకు వెల్లడించకూడదు.
ప్రెస్: ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రెస్, మీడియాతో ప్రత్యక్ష, పరోక్ష సంబం ధం కలిగి ఉండడం నిషిద్ధం.
ప్రసారమాధ్యమాలు: ప్రభుత్వ అనుమ తి లేకుండా రేడియో, టీవీ లేదా వార్త పత్రికల్లో ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా మాట్లాడకూడదు, వ్యాసాలు రాయకూడ దు. అయితే సాహిత్యపరమైన, కళాత్మకమైన అంశాల గురించి రాసుకోవచ్చు.
5. రాజకీయాలు, విమర్శలు
(రూల్ 17,18 &19):
విమర్శలు: ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను లేదా విధానాలను విమర్శించకూడదు.
సాక్ష్యం: ప్రభుత్వ అనుమతి లేకుండా ఏదేని కమిటీ లేదా కమిషన్ ఇతర అథారిటీ ముందు సాక్ష్యం చెప్పకూడదు.
రాజకీయాలు: ఉద్యోగి ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.
6. బంధుప్రీతి, పక్షపాతం
(రూల్ 21, 22 & 23):
బంధువులు: బంధువులు తన కింద పనిచేసేలా చూసుకోకూడదు. అలాగే తనకు లేదా తన బంధువులకు సంబంధించిన ఫైళ్ల ను తానే స్వయంగా డీల్ చేయకూడదు. తన ఉద్యోగంతో సంబంధం ఉన్న ప్రైవేట్ సం స్థల్లో తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉద్యోగం చేసేముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తన అధికారిక ప్రభావంతో తన కుటుంబ సభ్యులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించకూడదు.
7. ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తన
(రూల్ 24, 25 & 26 ):
ప్రభావితం: తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన కింద పనిచేసే లేదా పైన విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులను ప్రభావితం చేయకూడదు.
వివాహం: చట్టబద్ధమైన కారణం లేకుం డా మొదటి భార్య/ భర్త ఉండగానే రెండో వివాహం చేసుకోకూడదు.
వరకట్నం: వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం నేరం.
మద్యం: విధి నిర్వహణలో ఉన్నప్పుడు మద్యం సేవించకూడదు. బహిరంగ ప్రదేశాల్లో మత్తులో ఉండి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ నియమాలను ప్రభు త్వ ఉద్యోగులు తప్పక పాటించాలి.
వ్యాసకర్త: రిటైర్డ్ ప్రభుత్వ అధికారి




