calender_icon.png 11 January, 2026 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఉపాధిని కాలరాస్తున్న బీజేపీ

10-01-2026 07:05:28 PM

- ఉపాధిహామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

- డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఎన్నో చట్టాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. కోవిడ్ సమయంలో ఈ ఉపాధిహామీ పథకం కోట్లాదిమందికి అండగా నిలిచిందన్నారు. ఉపాధి హామీ పథకం వల్ల గతంలో ప్రజలకు ఏడాదికి 100 రోజుల పని హక్కు ఉండేదని, ఇప్పుడు వీబీజీ రామ్ జీ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం నోటిపై చేసి బడ్జెట్ కేటాయిస్తేనే ప్రజలకు పని లభిస్తుందన్నారు.

ఇప్పుడు ఈ చట్టం కింద కేంద్రం ఎంపికచేసిన పంచాయతీల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు పనులు గ్రామసభ నిర్ణయంపై కాకుండా ఢిల్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 30 వరకు జిల్లాలోని 423 గ్రామాల్లో పర్యటించి ఈ చట్టాన్ని యాదివిదిగా అమలు చేసేలా గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాది హామీ చట్టంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో పర్యటనలు. చేస్తారని, అందులో భాగంగా వచ్చే నెల 8న లక్షమందితో మహబూబ్నగర్ నుంచే సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టిజీ ఎంఎఫ్ సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, శేఖర్ నాయక్, అవేజ్ తదితరులు పాల్గొన్నారు.