calender_icon.png 12 January, 2026 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఫలితాలతో నిర్మల్ పేరు నిలబెట్టాలి

10-01-2026 07:01:16 PM

భైంసా,(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించి నిర్మల్ జిల్లాను అగ్ర పదంలో నిలపాలని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ఎస్టియు టీఎస్ ఉపాధ్యాయ సంఘం నేతలు మహేశ్వరుని కలిసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. అనంతరం 2026 డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రభుత్వ విద్యను బలోపితం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు పోటీపడి పని చేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు సమస్యలు పై మీరు చేసిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియుటిఎస్ జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్, ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణ్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.