10-01-2026 07:10:37 PM
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట,(విజయక్రాంతి): గ్రామీణా ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేది ఒక్క ఆర్ఎంపి లే అని అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ అన్నారు. శనివారం అశ్వారావుపేట పట్టణంలోని లహరి ఫంక్షన్ హాలో జరిగిన టిఎస్ఆర్ఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఆర్ఎంపిడబ్ల్యుఏ అశ్వారావుపేట మండల అధ్యక్షులు షేక్ ఉస్మాన్ (బాబా) అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ గ్రామాల్లో అర్ధరాత్రి అప రాత్రి అనే తేడా లేకుండా ఎవరు పిలిచిన వెళ్ళి వైద్యం అందిస్తూ వారి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ఎవరో కొద్ది మంది తమ పరిధులు దాటి వైద్యం చేస్తున్నారని, అటువంటి వైద్యాలు చేయవద్దు అని, రిస్క్ తీసుకోవద్దని తెలిపారు. ఆర్ఎంపిలు ఎన్నికల్లో ఎంతో తోడ్పాటును అందించారని అన్నారు.
ఆర్ఎంపి ల సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.అందరూ ఏకతాటిపై ఉండి ముందుకు సాగాలని కోరారు. అనంతరం అసోసియేషన్ జిల్లా బాధ్యులు మాట్లాడుతూ... ఐఎంసీ దాడులు ఎక్కువ అయ్యాయని, ఆర్ ఎం పి ల్లో ఉన్న సంఘాల ఒక్కటై ఉద్యమించాలన్నారు. భవిషత్ లో ఆర్ ఎంపిల వైద్యాలు చేసే పరిస్థితి కూడా ఉండదని, దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.