21 July, 2026 | 7:48 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

దివ్యాంగులకు ఉపాధి హామీ పని కల్పించాలి

18-05-2026 02:26 AM

బోధన్, మే 17 (విజయక్రాంతి): రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో వికలాంగుల సమస్యలు తెలుసుకోవడానికి సర్వేను చేశారు. సమావేశానికి కర్లం గంగాధర్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వికలాంగుల కుల జాతీయ వేదిక ఎన్,పి,ఆర్,డి. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్. మాట్లాడుతూ... గ్రామంలో సుమారు 70 మంది వికలాంగులు ఉన్నారు. వారి ఉపాధి హామీపని కల్పించడం లేదన్నారు.

అనేక సందర్భంగా. ఫీల్ అసిస్టెంట్ కు ఎంపీడీవో  చెప్పిరు. కానీ పనిని కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే వారికి పని కల్పించాలి. అంతోదయ రేషన్ కార్డులను ఇవ్వాలి నెలకు 6 వేలు పెన్షన్ ఇస్తామని ఇప్పటికీ ఇవ్వటం లేద అన్నారు. వాటిని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 3వేలు మాత్రమే పెన్షన్ ఇస్తుంది, .  రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు 11 వేల పెన్షన్ ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రెండు ప్రభుత్వాలు కల్పి 10 లక్షలు ఇవ్వాలన్నారు.

బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలి. స్థానిక ఎన్నికలలో ప్రభుత్వము. ఎన్నికలు లేకుండా డైరెక్ట్గా ఐదు శాతం వికలాంగుల నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, గాండ్ల రాజు,కరాళం గంగాధర్ గోగు నవీన్, కోశాధికారి పులి మల్లయ్య,గోగు రాములు సాయి కార్యదర్శి, పోతరాజు నరేష్ సాయ  కార్యదర్శులు మమ్మాయి గంగయ్య, ధనూరి సాయిలు, కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆలూరు గంగారెడ్డి ,యాటల మహేష్, ఆలూరి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.