calender_icon.png 3 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యాబెక్స్ కంపెనీతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

02-11-2025 08:34:52 PM

ఫ్యాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్ కంపెనీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమ యాజమాన్యాలు ఉపాధి కల్పించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఫ్యాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే ప్రైవేట్ పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించి స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.

వెలిమినేడు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్ కంపెనీలో పని చేసేందుకు స్థానిక నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా, కార్మికులుగా ఇతర కంపెనీ సిబ్బందిగా నియమించాలని అన్నారు. వెలిమినేడు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్ కంపెనీ వల్ల ఎలాంటి పొల్యూషన్ లేకుండా స్థానిక ప్రజలకు, పర్యావరణానికి  హాని కలిగించకుండా కంపెనీని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ రఘుమా రెడ్డి, స్థానిక నాయకులు అంతటి నరసింహ గౌడ్, మారగొని ఆంజనేయులు గౌడ్, వనమా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.