02-11-2025 08:36:52 PM
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి..
శివంపేట్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లును శివంపేట మండల కేంద్రంలోని సికిండ్లపూర్ గ్రామంలో మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇల్లును రాతోటి రాములమ్మ లక్ష్మయ్య గౌడ్ దంపతులు నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇల్లును రిబ్బన్ కట్ చేసి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూతన గృహాన్ని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి, పులిమామిడి నవీన్ గుప్తా, గోమారం మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు ఆంజనేయులు మల్లేష్ యాదవ్ లస్కరి ఆంజనేయులు, రాజశేఖర్ మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.