18-11-2025 10:02:59 AM
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో(Sukma District) మంగళవారం భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్(Encounter) జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి చెందాడు. ఎర్రబొరే పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ కొండపై ఉదయం భద్రతా సిబ్బంది బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు, ఆ ప్రాంతంలో మావోయిస్టు కేడర్లు ఉన్నారనే సమాచారం ఆధారంగా కాల్పులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.