06-07-2025 01:36:18 AM
ఇద్దరు మావోయిస్టులు మృతి
చర్ల, జూలై 5: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిసల్ట్ గార్డ్), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. వారికీ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది.