calender_icon.png 6 July, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్సాస్‌లో వరదల బీభత్సం

06-07-2025 01:33:49 AM

24కు చేరిన మృతుల సంఖ్య.. 23 మంది గల్లంతు

వాషింగ్టన్, జూలై 5: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించడంతో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా.. సమ్మర్ క్యాంప్‌కు వెళ్లిన 23 మంది బాలికల ఆచూకీ గల్లంతయ్యింది. వీరికోసం రెస్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడా లుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి బారీగా వరద నీరు చేరింది. గ్వాడాలుపే నది తీరం లో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్ లో వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌ను వరద ముంచె త్తడంతో 23 మంది బాలికలు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు.