17 April, 2026 | 10:13 AM

నలుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

15-06-2025 12:00 AM
  1. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ అటవీ ప్రాంతంలో ఘటన
  2. మృతుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు

భోపాల్, జూన్ 14: మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా..ఒక పరుషుడు ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాలాఘాట్‌లోని నక్సల్స్ ప్రభావిత బిత్లి పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని పచామా దాదార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ నిఘా వర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు సమాచారం అందింది.

దీంతో అటవీ ప్రాంతంలో సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఘటనా స్థలి నుంచి నాలుగు రైఫిల్స్, ఇతర ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, నాలుగు  నిత్యావసర వస్తువులును స్వాధీనం చేసుకున్నారు.

చనిపోయిన వారంతా జీఆర్‌బీ (గోందియా చెందినవారని ఎస్పీ ఆదిత్య మిశ్రా తెలిపారు. బాలాఘాట్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని, ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు.