12 June, 2026 | 12:02 PM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

దంతెవాడ- బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్

06-03-2026 02:12 AM

ఒక మావోయిస్టు మృతి

చర్ల, మార్చి 5 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని దంతవాడ బీజాపూర్ జిల్లాలోని సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బైరంగడ్ ఏరియా కమిటీ సభ్యుడు పూనం రాజేష్ అలియాస్ రాజీవ్ పూనెం మృతి చెందాడు. గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్ల నార్, గిర్సాపార, నెలగోడ గ్రామా ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సామగ్రి, ఆయుధాలు కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నక్సల్స్ ఆప్స్) రాహుల్ కుమార్ ఉయ కే నాయకత్వంలో ఎన్‌కౌంటర్ నిర్వహించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెండు వైపుల నుంచి కాల్పు లు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం నుంచి మృతదేహంతో పాటు ఇన్సాస్ ఎస్ ఎల్ ఆర్ రైఫిలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  కార్యక్రమంలో డీఆర్జీ బస్టర్ ఫైటర్స్ ఆపరేషన్ నిర్వహించారు.