19 April, 2026 | 10:22 AM

పిల్లలకు పువ్వులు ఇచ్చి ప్రోత్సాహం

12-06-2025 07:37 PM

నిర్మల్ (విజయక్రాంతి): పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో జిల్లా కేంద్రాన్ని ఆశ్రమ గిరిజన పాఠశాలలో తొలిరోజు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమౌళి తుకారాం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. పాఠశాలలో చదువుతున్న పూర్వ విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థుల లకు పుష్పాలు అందించి పండుగ వాతావరణంలో బడి ప్రారంభ వేడుకలను నిర్వహించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సదుపాలతో పాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలస గజ్జరం ఉపాధి సిబ్బంది ఉన్నారు