క్రీడాకారిణి ప్రతిభకు ప్రోత్సాహం
- చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సమత రెడ్డి రూ. 50వేలు.
- పంజాగుట్ట వాస్తవ్యులు గోవర్ధన్ భోగి కార్ రాజేశ్వర్‌లు రూ.50 వేల బహుకరణ
చేవెళ్ల జూన్ 9 (విజయ క్రాంతి): అంతర్జాతీయ లాక్రాస్ పోటీలో పాల్గొనేందుకు న ల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడప ల్లికి చెందిన పి. గోపిక ఎంపిక అయ్యింది. ఈనెల 17న ఉత్తర ప్రదేశ్ సెలెక్ట్ కమిటీ ద్వారా ఫైన మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఆడేందుకు వెళ్లనుంది. లాక్రాస్ పోటీలో ప్రతిభ చాటిన పి. గోపికను చేవెళ్ల ఏసీపీ కిషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ క్రీడాకారిణి ప్రోత్సహించేందుకు చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ ప్రస్తుత కౌన్సిలర్ బండారి శైలజాఆగిరెడ్డిలు రూ.50వేలు పంజాగుట్ట వాస్తవ్యులు గోవర్ధన్ భోగి కార్ రాజేశ్వర్ లు రూ.50 వేలు మొత్తం లక్ష రూపాయలు అందజేశారు.
ఎంపికైన క్రీడాకారిణి గోపిక చేవెళ్ల ఏసీపీ కిషన్ స్వగ్రామం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో 17 వార్డు కౌన్సిలర్ కృష్ణ నాయక్, మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, నాయకులు అత్తెల్లి రవీందర్ రెడ్డి, కవ్వాడి రాజావర్ధన్ రెడ్డి, పీసరి దామోదర్ రెడ్డి, బుర్ల మహేష్ కుమార్, రవి కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.






