24 August, 2026 | 3:50 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

24-08-2026 03:18 PM

బోథ్ ఆగస్ట్ 24 ( విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని సోనాల మండల నోడల్ అధికారి ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. స్థానిక తహసిల్దార్ మల్లేష్ ఎంపీడీవోతో పాటు పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పైన పలు శాఖల అధికారులు సర్వే చేస్తుండడంతో సర్వే బృందంలో ఉన్న శాఖలవారు సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..ప్రతి గ్రామస్తుడు ప్రజావాణిని వినియోగించుకునేందుకు ఆయా గ్రామాల కార్యదర్శిలు, సర్పంచులు, ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.