calender_icon.png 20 June, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాస్‌ను కలిసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ అదే!

20-06-2025 12:18:18 AM

మాళవిక మోహనన్.. హీరో ప్రభాస్ చేయిపట్టుకొని తెలుగింట అడుగుపెడుతోంది. గతంలో ‘తంగలాన్’లాంటి అనువాద చిత్రాల్లో తెలుగు తెరపై మెరిసిన ఈ భామ నేరుగా తెలుగులో కథానాయకిగా చేస్తున్నది మాత్రం ‘రాజాసాబ్’ సినిమానే. ఇలా రెబల్ స్టార్‌తో కలిసి టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటంతో అందరి కళ్లూ ఈ ముద్దుగుమ్మపైనే పట్టాయిప్పుడు. అదీగాక.. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్‌లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

ఇంకా చెప్పాలంటే.. మాళవికనే ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇలా అన్నీ కలిసివచ్చి టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజాసాబ్’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఫీలవుతున్నా. ప్రభాస్‌ను ఫస్ట్‌టైమ్ సెట్స్‌లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్‌మెంట్ అనిపించింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు.

బాగా మాట్లాడతారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.