03-12-2025 12:00:00 AM
ఎంజీయూ రిజిస్ట్రార్‌కి విద్యార్థి సంఘం వినతి
నల్గొండ రూరల్, డిసెంబర్ 2: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీ లో టాస్క్ పేరిట నిధులు దుర్వినియోగం చేసిన కాంట్రాక్ట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు టాస్క్ పెరిగా 4 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగించి వసూలు చేసిన డబ్బులను తిరిగి వసూలు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీ అధికారులను విద్యాలను తప్పుదారి పట్టించి చీటింగ్ చేసిన ప్రొఫెసర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం విద్యార్థి సంఘాలు రిజిస్టర్ రవి కి వినతి పత్రం అందజేశారు కాగా విడుదలవారీగా డబ్బులు చెల్లిస్తానని యూనివర్సిటీ అధికారులకు కాంట్రాక్టు ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ రాతపూర్వకంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్వీ నాయకులు వాడపల్లి నవీన్, బీసీ సంఘం నాయకులు కర్ణాకర్, ఎస్‌ఎఫ్‌ఐ రవి, స్వేరో స్టూడెంట్ యూనియన్ సురేష్, పిడిఎస్యు నాయకులు హర్ష MSF సుధీర్, గాదె శివ తదితరులు పాల్గొన్నారు.