calender_icon.png 3 December, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమున్నాం.. ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోండి

03-12-2025 12:00:00 AM

నాంపల్లి సీఐ రాజు

మర్రిగూడ, డిసెంబర్ 2 : ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోండి.... మేమున్నాం...ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు మనోధైర్యంతో ఓటు వినియోగించుకోవాలని మర్రిగూడ మండల కేంద్రం, ఎరుగండ్లపల్లిలో మంగళవారం నాంపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐడి రాజు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలను తెలంగాణ ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల మేరకు గ్రామాలలో ప్రశాంతంగా జరుపుకొని సహకరించాలని ఆయన కోరారు.

పోలీసుల కవాతును ఆయా గ్రామాల ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అన్నట్లు ఒకింత కొన్ని క్షణాల వరకు పోలీసులను ,వాహనాల కాన్వాయ్ ని ప్రజలు తిలకించారు.  అసలు విషయం తెలుసుకున్న అనంతరం ఓహో ఎన్నికల సందర్భంలో ప్రశాంతత కోసమా.... అంటూ పోలీసుల ముందు జాగ్రత్తను చర్యగా భావించి,ఆయా గ్రామాల ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సి.ఐ డి రాజు,  ఎస్త్స్ర ఎం. కృష్ణారెడ్డి, నాంపల్లి ఎస్త్స్ర లింగారెడ్డి, సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది బహుళ సంఖ్యలో పాల్గొన్నారు .