03-12-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ
నల్గొండ క్రైమ్, డిసెంబర్ 2: జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో, ప్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. జనవరి 12 వరకు ప్రతి వారం ఒక్క ప్రత్యేక థీమ్తో అవగాహన నిర్వహిస్తామన్నారు. ప్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్ను ఈ సందర్భంగా విడుదల చేశారు. విద్యార్థులతో సైబర్ నేరాలకు మోసపోకూడదనే ప్రతిజ్ఞ చేయించారు.
దేశవ్యాప్తంగా ప్రతీరోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల ద్వారా నష్టం జరుగుతోందని తెలిపారు. దీనిని నివారించగల మార్గం ప్రజల్లో అవగాహన పెంపుదలేనని చెప్పారు. చదువుకున్న యువత సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటే తమ కుటుం బ సభ్యులకు, పరిసరాల్లోని ప్రజలకు తెలియజేస్థా రని అన్నారు. సైబర్ నేరగాళ్లు లోన్ అప్స్, ఆన్లైన్ లింక్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఫ్రాడ్ కాల్స్, ఓటీపీ స్కామ్స్, డిజిటల్ అరెస్ట్, వాట్సాప్/ట్విట్టర్ లింక్స్, ఆన్లైన్ స్క్రాచ్ కారడ్స్, ఏపీక్ ఫైల్స్ వంటి పద్ధతులతో మోసాలను చేస్తున్నారని అనుమానాస్పద లింకులు, ఫైళ్ళు క్లిక్ చేయవద్దని సూచించారు.
ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, NCRP పోర్టల్ (www.cyber crime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ తక్షణ చర్య తీసుకుంటుందని తెలిపారు. అదనపు ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ విష్ణు, 2 టౌన్ ఎస్‌ఐ సైదులు, కళాశాల విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.