నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీర్స్ డే వేడుకలు
ముకరంపుర,(విజయక్రాంతి): భారతదేశ సాంకేతిక పితామహుడు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(Sir Mokshagundam Visvesvaraya Jayanti)ని పురస్కరించుకుని నిర్వహించే ఇంజనీర్స్ డే వేడుకలను కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం(Karimnagar Municipal Corporation Office)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సర్ ఎం. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మేయర్ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందికి ఇంజనీర్స్ డే(Engineers Day celebrations) శుభాకాంక్షలు తెలిపారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, సాంకేతిక నైపుణ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎస్ఈ, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.