30-10-2025 12:00:00 AM
ఫైనల్లో సౌతాఫ్రికా
గుహావటి, అక్టోబర్ 29: మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్ళింది. గత పరాజయాలకు ప్రతీకారం తీ ర్చుకుంటూ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సఫారీల దెబ్బకు చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రి కా 50 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది.
మిగిలిన బ్యాటర్లు విఫలమైనా వో ల్వార్ట్ 143 బంతుల్లో 169(20 ఫోర్లు,4 సిక్స ర్లు) చెలరేగిపోయింది. ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ కేవలం 1 పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత సీవర్ బ్రంట్, కాప్సీ హాఫ్ సెంచరీల తో పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ పేసర్ కాప్ 5 వికెట్లతో దెబ్బకొట్టింది. సఫారీ జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.