25 May, 2026 | 10:14 AM

జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

25-05-2026 09:36 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని బొడ్రాయి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Nagar Kurnool Collector Hemanta Keshav Patil) ఆకస్మికంగా సందర్శించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ కమిషనర్ నాగి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.