29-10-2025 01:12:48 AM
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఇందుకు స్పెషల్ క్లాసులను నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు ప్రత్యేక తరగతులను బోధించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు, రివిజన్ క్లాసులు, 71 రోజులపాటు నిర్వహిస్తారు. స్లోలెర్నర్స్ (నెమ్మదస్తులు), చదువులో వెనుకబడే వారిపై ఎక్కువగా దృష్టి సారిస్తారు.
సబ్జెక్టు టీచర్లు ప్రాక్టీస్ పేపర్లు రూపొందించి, విద్యార్థులకు టె స్టులు పెడతారు. ఆయా టెస్టుల్లో విద్యార్థులు చేస్తున్న తప్పొప్పులను గుర్తించి సూచనలు ఇస్తా రు. ఈసారి పదో తరగతి పరీక్షలను మార్చి 3వ వారంలో నిర్వహించే అవకాశముంది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్షలు ముగియడానికి ఒకట్రెండు రో జుల ముందు నుంచే పదో తరగతి పరీక్షలు పా రంభమవుతాయి.
పదో తరగతిలో ప్రైవేట్ పాఠశాలల కంటే మంచి ఫలితాలు వచ్చేలా సర్కారు బడుల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా నిర్వహి స్తున్నారు. అయితే ఈసారి కాస్త ముందుగానే చేపడుతున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు వి ద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా పాఠశాల వేళల్లో అదనంగా రెండు గంటలపాటు తర గతులను నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9 గం టల వరకు సాయంత్రం 4.15 నుంచి 5.15 గం టల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి.
ఉద యం, సాయంత్రం ఒక్కో సబ్జెక్టును విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తారు. 2023-24 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 91 శాతం మంది, 2024-25లో 92.6 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధించేలా పాఠశాల విద్యాశాఖ స్పెషల్ క్లాసులను నిర్వహించనుంది. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్నాక్స్ కూడా అందించనున్నారు.