30-10-2025 12:00:00 AM
కాన్‌బెర్రా,అక్టోబర్ 29: భారత్,ఆస్ట్రేలియా తొలి టీ ట్వంటీలో మెరుపులు చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. టీ20 మజాను ఆస్వాదిద్దామనుకున్న వారి ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లాడు. భారీ వర్షంతో మొదటి మ్యాచ్ రద్దయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఐదు ఓవర్ల తర్వాత వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.
దీంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. అభిషేక్ శర్మ 19 రన్స్‌కు ఔటైనా సూర్యకుమార్ యాదవ్ (39), గిల్ (37) దూకుడుగా ఆడారు. అయితే 9.4 ఓవర్లకు 97/1 స్కోర్ దగ్గర మరోసారి వర్షం అడ్డుపడింది. తర్వాత వాన తగ్గినా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.ఇరు జట్ల మధ్య రెండో టీ ట్వంటీ అక్టోబర్ 31న మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.