మెక్సికోపై ఇంగ్లాండ్ సంచలన విజయం
07-07-2026 12:00 AM
మెక్సికో సిటీ, జూలై 6 : సాకర్ ప్రపంచకప్‌లో ఆతిథ్య మెక్సికోకు ఇంగ్లాండ్ షాకిచ్చింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లీష్ జట్టు 3 స్కోరుతో మెక్సికోను ఓడిం చి చరిత్ర సృష్టించింది. బెల్లింగ్‌హామ్ రెండు గోల్స్ చేయగా, హ్యారీ కేన్ పెనాల్టీ గోల్‌తో ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశాడు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. చివరి అరగంటలో 10 మంది ప్లేయర్స్‌తోనే ఆడాల్సి వచ్చినా విజయాన్ని అందుకుంది. బెల్లింగ్‌హామ్ 36,38 నిమిషాల్లో వరుస గోల్స్ చేసాడు. తర్వాత 42వ నిమిషంలో మెక్సికో గోల్ చేయగా..చివర్లో హ్యారీ కేన్ పెనాల్టీతో ఇంగ్లాండ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. చివరి నిమిషాల్లో మెక్సికో కూడా పెనాల్టీ గోల్ చేసినా ఫలితం లేకపోయింది.






