7 July, 2026 | 2:21 AM

బ్రెజిల్‌కు నార్వే షాక్

07-07-2026 12:00 AM

న్యూయార్క్, జూలై 6 : సాకర్ ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్‌కు నార్వే షాకిచ్చింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్  ప్రీక్వార్టర్స్‌లో 1 స్కోరుతో పరాజయం పాలైంది. 79వ నిమిషంలో హాలాండ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి 1 ఆధిక్యాన్నందించాడు. ఆ తర్వాత 90వ నిమి షంలో రెండో గోల్ కొట్టాడు. దీంతో నార్వే తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇంజ్యూరీ టైంలో నెయ్‌మార్ పెనాల్టీని గోల్‌గా మలిచినా అప్పటికే నార్వే విజయం ఖాయ మైంది. నిజానికి ఫస్టాఫ్‌లోనే పలు అవకాశాలు వచ్చినా బ్రెజిల్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గిమారెస్ పెనాల్టీని వృథా చేయడం కొంపముంచింది. ఈ ఓటమి తర్వాత బ్రెజిల్ ఆటగాళ్లు మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు.