7 July, 2026 | 2:20 AM

నెయ్‌మార్ రిటైర్మెంట్

07-07-2026 12:00 AM

బ్రెజిల్ స్టార్ సంచలన నిర్ణయం

న్యూయార్క్, జూలై 6 : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మరో స్టార్ ప్లే యర్ కెరీర్ ముగిసింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రీ క్వార్టర్ ఫైనల్లో బ్రెజి ల్ ఓటమి తర్వాత దిగ్గజ ఆటగాడు నెయ్‌మార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

దీంతో 16 ఏళ్ల ఫుట్‌బాల్ కెరీర్ ముగి సింది. బ్రెజిల్ తరఫున 129 మ్యాచ్‌లు ఆడిన నెయ్‌మార్ 80 గోల్స్‌తో దేశ చరిత్రలో అ త్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2010లో బ్రెజిల్ జెర్సీలో అరంగేట్రం చేసిన నెయ్‌మార్ అదే వేదికపై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. నార్వేపై ప్రత్యా మ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన అతడు ఇంజూరీ టైమ్‌లో పెనాల్టీని గోల్‌గా మలిచి నా బ్రెజిల్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.