08-11-2025 08:20:31 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ టు అన్నవరంకు ప్రత్యేక టూర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కరీంనగర్ ఎం-1 డిపో మేనేజర్ విజయ మాధురి ప్రకటనలో తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 11న సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి అన్నవరం బయలుదేరుతుందని పేర్కొన్నారు. అన్నవరం, పిఠాపురం 10వ శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ కైలాస గిరి బీచ్, ద్వారక తిరుమల దర్శనాల అనంతరం 13న రాత్రి కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు 3500, పిల్లలకి 2625 రూపాయలు నిర్ణయించబడిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కొరకు 73828 49352, 99592 25920, 80746 90491 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.