మేల్కోకుంటే కష్టమే
గంభీర్‌కు అసలు పరీక్ష
బ్యాటర్లకు ఇంగ్లిష్ పిచ్‌ల సవాల్
ఓపికతో ఆడితేనే పరుగులు
టీ20 వరల్డ్ చాంపియన్స్ టీమిండియాకు ఐర్లాండ్ టూర్ పెద్ద షాకే... సుధీర్ఘ మైన ఇంగ్లాండ్ టూర్‌కు ముందు ఇది వార్నింగ్ లాంటిది. పరిస్థితులకు త్వరగా అలవాటు పడకుంటే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఈ సిరీస్‌తో తేలిపోయింది. మరి ఐర్లాండ్ టూర్ నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుంటుందా.. కఠినమైన ఇంగ్లీష్ పిచ్‌లపై గంభీర్ వ్యూహం ఎలా ఉండోబోతోంది ?
లండన్, జూన్ 29: ఏ ఆటలోనైనా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. ము ఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఎవ్వరినీ తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి జట్టుకూ సొంత బలాలు ఉంటాయన్నది ఐర్లాండ్ సిరీస్‌తో మరోసారి రుజువైంది. పసికూన, చిన్న జట్టు అంటూ భావించిన ఐర్లాండ్ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్లు భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఒకటి కాదు రెండు మ్యా చ్‌లలోనూ టీమిండియా ను నిలువరించి సిరీస్‌ను స్వీప్ చేసింది.
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా ఓటమి జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద హెచ్చరికగా చె ప్పొచ్చు. బలహీనమైన ప్రత్యర్థిగా భావించి నిర్ల క్ష్యం వహించడం, కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడం ఈ ఓటమికి కార ణం. అలాగే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి ఐర్లాండ్ జట్టును భారత్ తేలిగ్గా తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ కారణంగానే చావుదెబ్బ తినా ల్సి వచ్చిందని పలువురు మాజీలు క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్ ఓటమికి ప్రధా న కారణం బ్యాటర్లే. బెల్‌ఫాస్ట్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు గా బ్యాటర్లు తమ ఆటతీరును మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఐపీఎల్ తరహా దూకుడు అన్ని పిచ్‌లపై పనికిరాదని అ ర్థమైంది. అన్నింటికీ మించి క్రికెట్‌లో ఎ ప్పుడూ పరిస్థితుల కు అనుగుణంగా ఆ డాల్సిన అవసరం ఉం టుంది. అలా కాకుండా ఎప్పుడూ ఒకేలా ఆడేందుకు ప్రయత్నిస్తే ఆ వ్యూహం బెడిసికొడుతుంది.
ఐర్లాండ్‌తో సిరీ స్‌లో అదే జరిగింది. బ్యాటర్లు కాసేపు క్రీజు లో నిలిచేందుకు కూడా ప్రయత్నించలేదు. అందు కే ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్ భారత్ బ్యాటర్లకు మరో అగ్నిపరీక్ష కానుంది. అటు కోచ్ గౌతమ్ గం భీర్ వ్యూహాలకు కూడా ఇంగ్లీష్ పిచ్‌లు సవా ల్ విసురుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పిచ్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. దీని ప్రకారం చూస్తే ఇంగ్లీష్ పిచ్‌లపై స్వింగ్ ఎలా ఉండబోతుందనేది ఈ పాటికే మన బ్యాటర్లకు అర్థమై ఉండాలి.
ఇంగ్లాండ్ గడ్డపై స్విం గ్ బౌలింగ్‌కు అనుగుణంగా బ్యాటింగ్ టెక్ని క్ మెరుగుపరచుకోవాలి. అలాగే మిడి ల్ ఓవర్లలో పరుగులు సాధించే వ్యూహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ పిచ్లు బంతికి మంచి స్వింగ్, పేస్ అందిస్తాయి. ఆఫ్-స్టంప్ ఆవల పడే బంతులను వదిలేయడం, క్రీజులో ఎక్కువ సమయం కుదురుకునే వరకు సంయమనం పాటించడం కీలకం కానుంది. భారీ షాట్ల కంటే స్ట్రైక్ రొటేట్ చేయడం ఇక్కడ బ్యాటర్లకు కీలకం.
బంతి స్వింగ్ అవుతున్నప్పుడు సింగిల్స్ తీస్తూ, స్ట్రైక్ రొటేట్ చేయడం ద్వారా పరుగులు సాధించొచ్చు. అలాగే ఇంగ్లాండ్‌లో వాతావరణం తరచూ మారుతుంటుంది. మబ్బులు కమ్మినప్పుడు పిచ్ పేసర్లకు మరింత అనుకూలంగా మారుతుంది. ఈ పరిస్థితులను ముందుగానే అం చనా వేసి వ్యూహాత్మకంగా ఆడాలి. మొత్తం మీద ఇంగ్లీష్ స్వింగ్ పిచ్‌లకు అనుగుణంగా హెడ్ కోచ్ గంభీర్ మన బ్యాటర్లను ఎలా సన్నద్ధం చేస్తాడనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.






