ఫైనల్లో ఆస్ట్రేలియా
01-07-2026 12:00 AM
మహిళల టీ20 ప్రపంచకప్
లండన్, జూన్ 30: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రే లియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆ జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసిం ది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మహిళల జట్టు ఆసీస్ బౌలర్ల ధాటికి 125 పరుగులకే పరిమితమైంది.
కెప్టెన్ మాథ్యూస్(30), డాటిన్ (26) పరు గులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సోఫీ 2, గార్డనర్ 2 వికెట్లు పడగొట్టా రు. ఛేజింగ్‌లో దూకుడుగా ఆడిన ఆసీస్ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుం ది. బెత్ మూనీ 61 (8 ఫోర్లు), గార్డనర్ 35 (4 ఫోర్లు,1 సిక్సర్) అజేయంగా నిలిచారు. ఆసీస్ జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడం ఇది ఎనిమిదో సారి.






