30 June, 2026 | 2:10 AM

2028 ఒలింపిక్స్‌కు భారత్ క్వాలిఫై

30-06-2026 12:34 AM

విధివిధానాలు ప్రకటించిన ఐసీసీ

దుబాయి, జూన్ 29: టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించిన భారత మహిళల జట్టుకు ఊరట లభించిం ది. లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగబోయే ఒలింపిక్స్‌కు భారత్ అర్హత సాధిం చింది. విశ్వక్రీడల్లో చాలా ఏళ్ల తర్వాత క్రికెట్  రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనలను ఐసీసీ ప్రకటించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాతో పాటు భారత్ ఒలింపిక్స్ బెర్తులు దక్కించుకున్నాయి.

టీ20 ఫార్మాట్లో నిర్వహిం చే ఈవెంట్లో పురుషుల, మహిళల క్రికెట్ నుంచి ఆరేసి జట్లు పాల్గొంటాయి. డిసెంబరు 31, 2026 నాటికి ఉన్న అత్యుత్తమ ర్యాంకింగ్ కలిగిన నాలుగు జట్లను (ఖండాల వారీగా) ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలి యా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జట్ల అర్హత లాంఛనమే. ఇక ఆతిథ్య అమెరికా మాత్రం ర్యాంకింగ్స్‌లో కనీసం టాప్- ఉంటేనే అర్హత సాధిస్తుంది. మిగిలిన ఒక స్థానం కోసం.. టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.