15 June, 2026 | 2:51 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

‘తల్లి మనసు’కు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి

27-01-2025 12:00 AM

‘తల్లి మనసు’ చిత్రానికి ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి కోరారు. రచిత మహాలక్ష్మి,  కమల్ కామరాజు, సాత్విక్,  సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బ య్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమిది.

తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం యూనిట్‌కు అభినందన సత్కారం జరిగింది. ఈ సం దర్భంగా దర్శకుల అసోసియేషన్‌కు ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. చి త్రాన్ని వీక్షించిన అనంతరం ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, “ధూమపానం, మధ్యపానం హానికరమని తెలియజేసేందుకు ప్రకటనల కోసం ప్ర భుత్వాలు రూ. కోట్లు వెచ్చిస్తుంటాయి.

అలాగే తల్లి త్యాగనిరతిని, గొప్పతనాన్ని ఆవిష్కరించిన ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులతో పాటు ప్రభు త్వాలు ప్రోత్సహించాలి. అందుకోసం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి” అని అన్నారు. నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడు తూ, “మనసుకు హత్తుకునే సినిమా ఇది. సెకండ్ ఆఫ్ హైలైట్‌” అని పేర్కొన్నారు.

దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, ముప్పలనేని శివ.. ‘సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కథలో, పాత్రలలో లీనమవుతారు’ అన్నారు. ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. “చాలాకాలం తర్వాత ఓ మంచి  చిత్రాన్ని చూశామంటూ ప్రేక్షకులు చెబుతుండటం ఎనలేని సంతోషాన్ని కలిగించింది.

తల్లి తపన, భావోద్వేగాన్ని ఆవిష్కరించిందీ చిత్రం” అన్నారు. ము త్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ.. “తొలి రోజు, మార్నింగ్ షోతోనే చూసి తీరాల్సిన చిత్రమన్న టాక్ రావడంతో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ వస్తోందని, ఇది మేము తీసిన చిత్రమని చెప్పడం కాకుండా మంచి పాయింట్‌తో తీసిన ఈ  చిత్రాన్ని ప్రేక్షకులు మిస్ కావద్దు” అని విజ్ఞప్తి చేశారు.