26 May, 2026 | 6:50 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

అనంత పద్మనాభ ఆలయ నేపథ్యంలో

27-01-2025 12:00 AM

‘రుస్తుం’ తరువాత సుధీర్ బాబు హీరోగా ప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు.  ‘జటాధర’ అనే పేరుతో ఈ సినిమా రూపొందనుంది. వెంకట్ కల్యా ణ్ దర్శకత్వంలో ఈ చిత్రం సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొం దనుంది.

ఈ చిత్రానికి సం బంధించిన ప్రకటనను ఒక పోస్టర్‌తో రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేశా రు. ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. “జీ స్టూడియో స్‌లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం.

‘జటాధర’ థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది” అన్నారు. ‘జటాధర’ సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చు ట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చి త్రంలో చూపించనున్నారు.

అక్కడి నిధిని మాత్రమే కా కుండా ఆలయ చరి త్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సిని మాలో సుధీర్‌బా బు క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఫిబ్రవరిలో జటాధర చిత్రీకరణ ప్రారంభం కానుంది.