17 April, 2026 | 10:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

‘సెయింట్ మేరీస్’లో పర్యావరణ దినోత్సవం

06-06-2025 12:16 AM

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ అనే ఇతివృత్తాన్ని స్వీకరించి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో విద్యార్థులు, అధ్యాపకులు ప్లకార్డులు పట్టుకుని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, సమాజంలో పచ్చని అలవాట్లను ప్రోత్సహించాలని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల డైరెక్టర్ రెవరెండ్ ఫ్రమ్ ఆంథోనీ వినయ్, అధ్యాపకులు పర్యావరణ రక్షణలో సమిష్టి బాధ్యత అవసరాన్ని నొక్కి చెప్పారు.