06-06-2025 12:15:40 AM
నల్లగొండ టౌన్, జూన్ 5 : నల్గొండ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన వేదాంత్ స్కూల్ విద్యాశాఖ అనుమతితో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, పాఠశాల నిర్వాహకులు సోమగాని శంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ శోభన్, డైరెక్టర్లు శ్యాం ప్రసాద్, గోపాల్ రెడ్డి, ఆదిత్య సామ్రాట్, బ రణ్ ల తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వివిధ తరగతి గదిలోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, పబ్బు సాయిశ్రీ, సందీప్ గౌడ్, పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.