5 June, 2026 | 4:46 PM

సనత్‌నగర్‌లో పర్యావరణ దినోత్సవం

05-06-2026 03:33 PM

స్వచ్ఛభారత్, మొక్కలు నాటే కార్యక్రమం

సనత్‌నగర్ జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో సనత్ నగర్ డివిజన్ లోని ఎస్ఆర్టి కాలనీలో నవవనాల పార్కులో ఏర్పాటుచేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమం మరియు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటడం మోడీ గారి పిలుపుమేరకు జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు బిజెపి రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి గారు జిల్లా మాజీ అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ గారు జిల్లా కన్వీనర్ కనకట్ల హరి మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ, ఎల్. నర్సింగ్ రావు, నరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు