5 June, 2026 | 2:15 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

05-06-2026 01:09 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

పెంచికల్ పెట్ (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) పెంచికల్‌పేట్ ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత, జిల్లా ఎస్‌పీ నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలామణి, అదనపు ఎస్‌పీ చిత్తరంజన్‌, కాగజ్‌నగర్ డీఎఫ్‌వో అప్పయ్యలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. ఎస్‌పీ నితికా పంత్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడాలని అన్నారు. అనంతరం అధికారులు ప్లాస్టిక్ రహిత వస్తువుల అవగాహన స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ అనిల్ కుమార్, సర్పంచ్ భక్తు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.